సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా 170వ చిత్రం `వేట్టయాన్` టి.జెజ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకె క్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రజనీకాంత్ తన పోర్షన్ షూటింగ్ ముగించి 171వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించారు. కొన్ని రోజులుగా ఆ సినిమా షూట్ లోనే పాల్గొంటున్నారు. ఈ గ్యాప్ లో జ్ఞాన్ వేల్ `వేట్టయాన్` పెండింగ్ షూటింగ్ పనుల్లో బిజీ అయ్యారు. రజనీ పార్ట్ పూర్తవ్వడంతో మిగతా నటీనటులపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలపై దృష్టి పెట్టి ముందుకు సాగారు.
తాజాగా `వేట్టయాన్` చిత్రీకరణ మొత్తం పూర్తయింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో మంజు వారియర్ తన పాత్రకు సంబంధించి డబ్బింగ్ పనులు కూడా పూర్తిచేసారు. సినిమాలో అమితాబచ్చన్, పహాద్ పాజిల్, రానా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే వాళ్ల పాత్రలకు సంబంధించి ఇంకా డబ్బింగ్ పనులు మొదలు కానట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా సినిమాకి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వస్తోంది. `వేట్టయాన్` కూడా` జైభీమ్` తరహాలోనే వాస్తవ సంఘటనలు ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు లీకులందుతున్నాయి. ఇందులో రజనీకాంత్ పోలీస్ పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఆ పాత్ర నిజ జీవితంలో జరిగిన వాస్తవ సంఘట నుంచే తీసుకున్నట్లు సమాచారం. ఓ నిజాయితీగల పోలీస్ అధికారి విషయంలో సమాజం తీరును ప్రశ్నిస్తూ ఆ పాత్రని హైలైట్ చేస్తున్నారుట.
అలాగే సినిమాలో రానా పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందంటున్నారు. ఆ పాత్ర ముగింపు ప్రేక్షకుల్ని ఎంతో ఎమోషన్ కి గురి చేస్తుందని, కంట కన్నీరు పెట్టిస్తుందిట. కథని డ్రెమటైజ్ చేయడం కంటే వీలైనంత వాస్తవ కథగానే చెప్పే ప్రయత్నం చేస్తున్నారుట. అన్ని పనులు పూర్తి చేసి అక్టోబర్ 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Recent Random Post: