50 ఏళ్ల సోనాలి బింద్రే మళ్లీ ఆకట్టుకుంటున్న అందం!

Share


సినిమా ఇండస్ట్రీలో ఎన్నోమంది హీరోయిన్లు వస్తూ పోతుంటారు. కానీ కొంతమంది మాత్రమే ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతారు. అలా ఎప్పటికీ గుర్తుండిపోయే నటి సోనాలి బింద్రే. మధ్యలో సినిమాలకు దూరమైనా కూడా ఆమె పేరు, గుర్తింపు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా ఆమె క్యాన్సర్‌తో పోరాడి గెలిచిన తీరుతో ఎంతోమంది అభిమానులకు ఆదర్శంగా మారారు. ఆ కష్టకాలాన్ని దాటుకుని తిరిగి సినీ రంగంలోకి అడుగుపెట్టిన అరుదైన స్టార్‌గా ఆమెను అందరూ గౌరవిస్తారు.

ఇటీవల సోనాలి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తన అందమైన ఫోటోలను అభిమానులతో పంచుకుంటోంది. యంగ్ హీరోయిన్లు గ్లామర్ షోతో ఫోటోలు షేర్ చేస్తే అవి ఎక్కువగా వైరల్ అవుతాయి. అయితే సీనియర్ నటీమణులు అలా స్కిన్ షో చేస్తే అంతగా స్పందన రాదు. కానీ సోనాలి విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. 50 ఏళ్ల వయసులోనూ ఎలాంటి అతిగా కాకుండా, ఎలిగెంట్‌గా ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటుంది.

తాజాగా ఆమె పింక్ చీరలో ఫోటోలు షేర్ చేస్తూ మళ్లీ అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ ఫోటోల్లో 50 ఏళ్ల వయసులోనూ ఆమె అందం ఏమాత్రం తగ్గలేదని, ఇంకా సీనియర్ హీరోలకు జోడీగా హీరోయిన్‌గా కనిపించేంత అందం ఆమెకు ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఏడాది బి హ్యాపీ అనే హిందీ చిత్రంలో గెస్ట్ రోల్‌లో కనిపించిన సోనాలి, త్వరలో మరికొన్ని సినిమాల్లో నటించాలని ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం రెండు హిందీ ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది ఫుల్ లెంగ్త్ రోల్‌లో సోనాలి నటించిన సినిమా వచ్చే అవకాశముందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు, తెలుగు సినిమాల్లోనూ ఆమెను మళ్లీ చూడాలని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


Recent Random Post: