66 ఏళ్ల నాగార్జున ఫిట్‌నెస్ సీక్రెట్ రివీల్!

Share


అక్కినేని నాగార్జునను ప్రత్యేకంగా పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ మాన్మథుడు, ‘కింగ్’గా దశాబ్దాలుగా ఇండస్ట్రీలో సీనియర్ హీరోగా ఉన్న ఆయనకు అపారమైన ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికీ బ్యాక్-టు-బ్యాక్ సినిమాల‌తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగార్జున ప్రస్తుతానికి 66 ఏళ్ళ వయసులో ఉన్నారు. అయినప్పటికీ, ఆయ‌న కుర్ర హీరోల‌కు కూడా పోటీ ఇచ్చే అందంతో కనిపిస్తూనే ఉన్నారు.

తన ఫిట్‌నెస్‌ను నిలుపుకోవడంలో నాగార్జున రీసెంట్‌గా తన హెల్త్ సీక్రెట్‌ను అభిమానులతో పంచుకున్నారు. ఆయన వెల్లడించిన ఫిట్‌నెస్ సీక్రెట్ అంత పెద్దది కాదు – “టైమ్‌కు తినడం”. నాగ్ చెప్పారు,
“నేను ఎప్పుడూ కడుపు మాడ్చుకొని డైట్ చేయను. అన్నీ తింటాను, కానీ టైమ్‌కు తింటాను. అలాగే ప్రతీ రోజూ కచ్చితంగా జిమ్ చేస్తాను. గత 45 ఏళ్లుగా హెల్త్ బాగానే ఉన్నప్పుడు తప్ప మిగిలిన అన్ని రోజులు జిమ్ చేశాను. ఇదే నా ఫిట్‌నెస్ సీక్రెట్.”

అయితే ఫిట్‌గా ఉండటానికి కేవలం వ్యాయామం మాత్రమే కాదు, పాజిటివ్ మైండ్‌సెట్ కూడా అవసరమని నాగ్ చెప్పారు. ఆయన ప్రస్తావించారు, “ఎప్పుడూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోను. అన్ని విషయాలను పాజిటివ్‌గా చూస్తాను. ఏ సమస్య వచ్చినా డెల్ అవను. ప్రస్తుతానికి చాలా హ్యాపీగా ఉన్నాను. ఇద్దరు కొడుకులకు పెళ్లి చేసాను, వాళ్లను చూస్తే చాలా ఆనందంగా ఉంది.”

నాగార్జున ఫిట్‌నెస్ రహస్యంలో ముఖ్యమైనది క్రమశిక్షణ, హెల్తీ ఆహారం, మరియు మానసిక శాంతి అని స్పష్టం చేశారు. ఏ వయసులోనైనా ఈ మూడు అంశాలను పాటిస్తే ఫిట్‌గా, యంగ్‌గా కనిపించవచ్చని ఆయన సూచించారు.


Recent Random Post: