
విశ్వనటుడు కమల్ హాసన్ ఏజ్‌లెస్ హీరోగా ఇప్పటికీ అదే ఉత్సాహం, ఉత్సాహభరితమైన ఎనర్జీతో కనిపిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన విక్రమ్, కల్కి 2898 ఏడి, థగ్ లైఫ్ వంటి చిత్రాల్లో తన నటనతో మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఇక కల్కి 2898 ఏడి సీక్వెల్ సహా ఆయన రాబోయే సినిమాల్లోనూ కమల్ హాసన్ యొక్క విశ్వరూపం చూడబోతున్నామని అభిమానులు ఆనందంగా ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో కమల్ హాసన్ తన 71వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.
అయితే ఈ వయసులోనూ ఇంత ఫిట్‌గా, యంగ్‌గా ఉండగలగడం ఎలా? అనేది చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది. కానీ దాని వెనుక ఉన్న రహస్యం చాలా సింపుల్ అయినప్పటికీ దాన్ని ఆచరించడం మాత్రం కష్టసాధ్యం. భారతీయ సినీ త్రిమూర్తులుగా పిలిచే ఖాన్ల కంటే కూడా కమల్ హాసన్ మరింత ఫిట్‌గా కనిపించడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనం. ఖాన్ల కంటే దాదాపు పది సంవత్సరాలు పెద్దవాడైనా, ఇప్పటికీ అదే ఉత్సాహంతో కనిపించడం వెనుక ఆయన దినచర్యే ప్రధాన కారణం.
ప్రతిరోజూ యోగా, మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్, రెగ్యులర్ జిమ్ రూటీన్తో పాటు ధ్యానం కూడా ఆయన జీవనశైలిలో ఒక భాగం. వీటితో పాటు సమతుల ఆహారం కూడా ఆయన ఆరోగ్య రహస్యంలోని కీలక అంశం. ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే భోజనం తీసుకుంటారు. ప్రాసెస్ చేసిన ఫుడ్, చక్కెర, ఆల్కహాల్ లాంటి వాటిని పూర్తిగా దూరం పెట్టారు. అల్పాహారంలో పండ్లు, తృణధాన్యాలతో ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకుంటారు. రాత్రి భోజనాన్ని మాత్రం తేలికగా, సులభంగా జీర్ణమయ్యేలా ప్లాన్ చేస్తారు.
నియమితమైన వ్యాయామం, ధ్యానం, యోగా, అలాగే నీరు ఎక్కువగా తాగడం ద్వారా కమల్ హాసన్ తన ఫిట్నెస్ను కాపాడుకుంటున్నారు. అందుకే ఆయనను నేటికీ “ఏజ్‌లెస్ హీరో” అని అభిమానులు గర్వంగా పిలుస్తున్నారు. కల్కి 2898 ఏడి సీక్వెల్లో ఆయన ఏ రూపంలో కనిపించబోతారో చూడాలని అందరూ ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఈరోజు ఆయన బర్త్‌డే సందర్భంగా అశ్వనిదత్ టీం కల్కి 2898 ఏడి సీక్వెల్‌పై ఏదైనా అప్డేట్ ఇస్తారేమో అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recent Random Post:














