ట్విట్టర్‌లో మళ్లీ మోత మోగిస్తున్న సూపర్‌ స్టార్ ఫ్యాన్స్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ మరో సారి ట్విట్టర్‌ లో మోత మ్రోగిస్తున్నారు. సరిగ్గా రెండు వారాల క్రితం వారు మహేష్‌ బాబు బర్త్‌డే కామన్‌ డీపీ విడుదల సందర్బంగా ఆ హ్యాష్‌ ట్యాగ్‌ను 24 గంటల్లో ఏకంగా 3.1 కోట్ల ట్వీట్స్‌ చేసిన విషయం తెల్సిందే. ఇక రేపు మహేష్‌ పుట్టిన రోజు సందర్బంగా సందడి మళ్లీ అదే రీతిలో కనిపిస్తుంది. బర్త్‌డే కు ముందు రోజే అంటే నేడు సాయంత్రం 6 గంటలకు ట్రెండ్‌ మొదలయ్యింది. హ్యాపీబర్త్‌ డే హ్యాష్‌ ట్యాగ్‌ 9 నిమిషాల్లో 1 మిలియన్‌ ట్వీట్స్‌ను 20 నిమిషాల్లో 2 మిలియన్‌ ల ట్వీట్స్‌ను గంటన్నరలో 10 మిలియన్‌ల ట్వీట్స్‌ను ఫ్యాన్స్‌ చేసి రికార్డు బద్దలు కొట్టారు.

మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ ధాటికి వరల్డ్‌ ట్రెండ్స్‌ లో కూడా మహేష్‌ బాబు బర్త్‌డే హ్యాష్‌ ట్యాగ్‌ నెం.1 గా నిలిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో ట్రెండ్స్‌ నడుస్తున్నా మహేష్‌ ఫ్యాన్స్‌ ట్వీట్స్‌ నెం.1 గా నిలిచాయి. ఇండియా వైడ్‌గా నెం.1 గా నిలవడం కామన్‌గా చూస్తూ ఉంటాం. కాని ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్స్‌ లో నెం.1 గా నిలవడం అంటే మామూలు విషయం కాదు. మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ ఈసారి మరో సరికొత్త రికార్డును నమోదు చేసే అవకాశం ఉందని అనిపిస్తుంది.

ఇప్పటికే 3.1 కోట్ల ట్వీట్స్‌తో ఆల్‌ ఇండియా రికార్డ్‌ వారికే ఉంది. ఇప్పుడు రేపు సాయంత్రం వరకు ఏ స్థాయిలో ట్వీట్స్‌ పడతాయో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 3.5 నుండి 4 కోట్ల వరకు కూడా నమోదు అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. త్వరలో రాబోతున్న పవన్‌ కళ్యాణ్‌ బర్త్‌డేకు వీరు పెద్ద టార్గెట్‌ను నమోదు చేసే అవకాశం కనిపిస్తుంది.


Recent Random Post: