రకుల్ – రానా లతో మాట్లాడిన రియా… ఫోన్ కాల్ లిస్ట్ వెల్లడించిన సంచలన విషయాలు…!


బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసు విచారణలో రోజులు గడిచే కొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముందుగా ఈ కేసును మహారాష్ట్ర పోలీసులు ఆ తర్వాత బీహార్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఇప్పుడు సీబీఐ మరియు ఈడీ లు సుశాంత్ కేసుపై విచారణ ప్రారంభించాయి. ఇప్పటికే సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఈ కేసుతో సంబంధం ఉందని భావిస్తున్న మరికొందరిపై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు ఈడీ ఇప్పటికే రియాతో పాటు మరికొందరిని విచారించింది. ఈ క్రమంలో నేషనల్ మీడియా కూడా ఈ కేసులో నిజానిజాలు బయటపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ ఒకటి రియా కాల్ లిస్ట్ ను సంపాదించి.. ఇండస్ట్రీలోని చాలా మంది సెలబ్రిటీలతో రియా చక్రవర్తి టచ్ లో ఉన్నట్లు వెల్లడించారు. ఈ వార్తలపై నిజం ఎంత ఉందో తెలియదు కానీ రియా కాల్ లిస్ట్ లో మన టాలీవుడ్ సెలబ్రిటీలతో కూడా ఆమె మాట్లాడినట్లు తెలుస్తోంది.
రియా సీడీఆర్ లిస్ట్ ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ కి ఆమె 30 సార్లు కాల్ చేయగా.. రకుల్ ఆమెకు 14 సార్లు కాల్ చేసింది. వీరి మధ్య టెక్స్ట్ మెసేజ్ సంభాషణ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఇక దగ్గుబాటి రానా కి రియా 7 సార్లు కాల్ చేయడా.. రానా 4 సార్లు ఆమెకు కాల్ చేసినట్లు వెల్లడించింది. అమీర్ ఖాన్ కి రియా మూడు మెసేజులు చేసినట్లు తెలిపింది. ‘ఆసిఖీ 2’ హీరో ఆదిత్య రాయ్ కపూర్ కి ఆమె 16 సార్లు కాల్ చేయగా.. అతను రియాకి 7 సార్లు కాల్ చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా శ్రద్ధాకపూర్ కి రియా మూడు సార్లు కాల్ చేయగా.. శ్రద్ధా రెండు సార్లు ఆమెకు కాల్ చేసినట్లు చూపించింది. హీరో సన్నీ సింగ్ కి ఆమె 7 సార్లు ఫోన్ చేయగా.. అతను రియాకి 4 సార్లు కాల్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల మరణించిన సరోజ్ ఖాన్ తో కూడా రియా చక్రవర్తి ఫోన్ లో సంభాషించినట్లు ఫోన్ కాల్ లిస్ట్ వెల్లడించింది. ఇక దర్శకనిర్మాత మహేష్ భట్ కు రియాకు మధ్య 16 కాల్స్ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది.


Recent Random Post: