పవన్ కళ్యాణ్ ట్రిపుల్ ధమాకా కోసం సిద్ధమా.?

జనసేనాని అలియాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత కంబ్యాక్ ఫిల్మ్ గా చేస్తున్న సినిమా ‘వకీల్ సాబ్’. పవన్ రెండు విభిన్న గెటప్స్ లో లాయర్ గా కనిపించనున్న ఈ సినిమా లాక్ డౌన్ సమయానికి 70% షూటింగ్ పూర్తి చేసుకుంది. మరో 25 రోజులు షూట్ చేస్తే వకీల్ సాబ్ చిత్ర షూటింగ్ ఫినిష్ అవుతుంది. వీలైనంత వరకూ ఈ అక్టోబర్ తర్వాత సినిమా మొదలు పెట్టి 2021 సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానుల్ని ఖుషీ చేయడం కోసం ట్రిపుల్ ధమాఖాని సిద్ధం చేస్తున్నారు. అందులో మొదటిది ‘వకీల్ సాబ్’ టీం ఫస్ట్ టీజర్ ని సిద్ధం చేస్తోంది. ఇక రెండవది పవన్ కళ్యాణ్ – క్రిష్ ఫిల్మ్ నుంచి కూడా ఓ స్పెషల్ సర్ప్రైజ్ రానుంది. తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కి సన్నిహితుడైన రామ్ తాళ్ళూరికి ఓ సినిమా చేస్తానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ మాటిచ్చాడు. ఆ సినిమా అధికారిక ప్రకటన, అనగా పవన్ కళ్యాణ్ 28వ సినిమా అనౌన్స్ మెంట్ ఆ రోజు చేయనున్నారు.

అంతే కాకుండా, ఇప్పటికే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, క్రిష్ సినిమా, హరీష్ శంకర్ తో ఓ మూవీ కమిట్ అయ్యి ఉన్నారు. రాజకీయాల్లోకి వెళ్ళాక సినిమాలకి దూరంగా ఉంటారని బాధ పడిన ప్రేక్షకులకి సినిమాలు అనౌన్స్ చేసి ఆనందాన్ని ఇచ్చారు. ఇప్పటికే మూడు సినిమాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరో 3 సినిమాలకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారట.

ఆ విశేషాల్లోకి వెళితే.. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఓ సినిమా, హారిక హాసిని బ్యానర్ లో ఓ సినిమా మరియు పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఓ సినిమా చేయడానికి సముఖత తెలిపినట్లు సమాచారం.. దీని ప్రకారం పవన్ కళ్యాణ్ వరుసగా 6 సినిమాలను ఫినిష్ చేయనున్నారు. కోవిడ్ పాండెమిక్ లేకపోయి ఉంటే ఈ ఏడాదే 2 సినిమాలు పూర్తి చేసి, మూడవ సినిమాని మొదలు పెట్టి ఉండేవారు. కానీ ఈ కోవిడ్ ఆ ప్లాన్స్ ని కాస్త డిస్టర్బ్ చేసింది.

అభిమానులు మాత్రం రావడం కాస్త లేట్ అవ్వచ్చేమో గానీ బ్లాక్ బస్టర్ కొట్టడం మాత్రం పక్కా అని హ్యాపీ గా ఉన్నారు. అలాంటి వారికి బర్త్ డే రోజున మూడు సర్ప్రైజ్ లు, మరో మూడు సినిమాల అనౌన్స్ మెంట్ కూడా ఉండే అవకాశం ఉందనే విషయం మరింత ఆనందాన్ని ఇచ్చే అంశం.


Recent Random Post: