ప్రపంచంలో ఎన్నో భాషల్లో బిగ్‌బాస్ ప్రసారం అవుతోంది. హిందీలో బిగ్‌బాస్ పుష్కర కాలంగా ప్రసారం అవుతూనే ఉంది. అక్కడ కొత్త సీజన్‌కు ప్రకటన వచ్చింది. ఇక తెలుగులో నాల్గవ సీజన్‌కు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. నాల్గవ సీజన్ కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది. అసలు ఉంటుందా లేదా అనే అనుమానాల మద్య సీజన్ ప్రారంభం కాబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సమయంలో బిగ్‌బాస్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా షో ఫార్మెట్లో పలు మార్పులు చేర్పులు చేశారట.
ఇప్పటి వరకు బిగ్‌బాస్ షో అంటే నిన్న ఇంట్లో జరిగిన విశేషాలను తర్వాత రోజు ఎపిసోడ్లో ప్రసారం చేస్తారు. అంటే సోమవారం ప్రసారం అయ్యే ఎపిసోడ్ ఆదివారం జరిగిందన్నమాట. కాని ఈసారి తెలుగు బిగ్‌బాస్ మాత్రం కాస్త విభిన్నంగా ఒక్క రోజు ఆలస్యంగా కాకుండా ఏకంగా వారం రోజుల ఆలస్యంగా ప్రసారం కాబోతుందట. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ ఆరోగ్యం మరియు ఇతరత్ర విషయాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.
ఈ ఆదివారం షూట్ చేసిన కార్యక్రమాలు సంఘటనలు వచ్చే ఆదివారం ప్రసారం అవుతాయన్నమాట. కరోనా కారణంగా షోను ఒక్క రోజు గ్యాప్‌లో ప్రసారం చేయడం సాధ్యం కాదని అందుకే వారం రోజులు గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ లో ఎడిటింగ్ చేసి ప్రసారం చేస్తారనే టాక్ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే ప్రేక్షకులు ఇంతకు ముందు అంతగా షో పై ఆసక్తి చూపించే అవకాశం లేదంటున్నారు.
ఈ విషయంలో అనుమానం రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు షో ఫార్మట్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. గతంలో మాదిరిగా ఆడియన్స్ కూడా ఈసీజన్లో ఉండబోరు. వీకెండ్ ఎపిసోడ్స్‌కు గతంలో ఆడియన్స్ వచ్చే వారు. ఈసారి వారు ఉండరు. ఈ నెల చివర్లో ప్రారంభం కాబోతున్న బిగ్‌బాస్ సీజన్ 4 మొదటి మూడు సీజన్స్ మాదిరిగా ఆకట్టుకుంటుందా లేదా అనేది చూడాలి.
Recent Random Post: