వైరల్ : స్టార్ నటుడి న్యూడ్ రన్నింగ్


బాలీవుడ్ తో పాటు పలు భాషల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న మిలింద్ సోమన్ ఇటీవల 55వ ఏట అడుగు పెట్టాడు. ఈ సందర్బంగా ఆయన తన ఫిట్ నెస్ ను నిరూపించుకునేందుకు గాను బీచ్ లో రన్నింగ్ చేశాడు. సాదారణంగా రన్నింగ్ చేస్తే పెద్దగా ఈ విషయం గురించి చర్చ ఉండేది కాదు. కాని ఆయన పూర్తి న్యూడ్ గా బీచ్ లో రన్నింగ్ చేసి తన ఫిట్ నెస్ ను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. మిలింద్ సోమన్ ఈమద్య కాలంలో నటుడిగా ఆశించిన స్థాయిలో ఆఫర్లు దక్కించుకోలేక పోతున్నాడు. ఆ కారణంగానే న్యూడ్ రన్నింగ్ చేసి వార్తల్లో నిలిచాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈ ఫొటో పై పలువురు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. కొందరు మిలింద్ ఈ వయసులో కూడా ఫిట్ నెస్ ను ఇంతగా కలిగి ఉండటంను అభినందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఫిట్ నెస్ ను నిరూపించుకునేందుకు మరో మార్గం దొరకలేదా అంటూ విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో మిలింద్ పై మీమ్స్ చేస్తున్నారు. పలువురు కనీసం వీటిని అయినా వేసుకోండి అంటూ లో దుస్తువులను షేర్ చేశారు. మరి కొందరు లో దస్తులు కూడా లేకుండా వర్కౌట్ చేస్తే మంచి ఫిట్ నెస్ వస్తుందని తెలియక ఇన్ని రోజులు డ్రస్ పై రన్నింగ్ చేయడంతో పాటు వర్కౌట్ లు చేశాము అందుకే తమ ఫిట్ నెస్ మీ అంతగా లేదు అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మిలింద్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ మరియు వైరల్ ఆఫ్ సోషల్ మీడియా అయ్యాడు.


Recent Random Post: