స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రంతో కొన్ని మెట్లు పైకి ఎదిగిపోయాడు. అల్లు అర్జున్ ఇప్పుడు రీజినల్ స్టార్ మాత్రం కచ్చితంగా కాడు. ఈ సినిమాతోనే తన దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును తీసుకొచ్చింది.
అల వైకుంఠపురములో తర్వాత ప్యాన్ ఇండియా వైడ్ గా సినిమాలను ప్లాన్ చేసాడు బన్నీ. ఇప్పటికే సుకుమార్ దర్శకత్వంలో పుష్ప చిత్రాన్ని చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక కొరటాల శివ దర్శకత్వంలో సినిమాలను లైన్లో పెట్టాడు. ఇది కాకుండా ఇప్పుడు అల్లు అర్జున్ కు మరో అరుదైన గౌరవం లభించింది.
గూగుల్ వంటి టాప్ సెర్చ్ ఇంజిన్ కు పోటీగా యాహు అనే మరో సెర్చ్ ఇంజిన్ ఉన్న విషయం తెల్సిందే. 2020కు సంబంధించి మోస్ట్ సెర్చ్డ్ మేల్ సెలబ్రిటీ లిస్ట్ తీయగా అందులో టాప్ 10 లో నిలిచాడు బన్నీ. అంతే కాకుండా ఈ ఘనతను దక్కించుకున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోగా నిలిచాడు.
బాలీవుడ్ ను తీవ్ర విషాదంలో ముంచెత్తిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మొదటి స్థానంలో నిలిచాడు. అలాగే దిగ్గజ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 7వ స్థానంలో, ఈ లాక్ డౌన్ లో అందరికీ సహాయం చేస్తూ వార్తల్లో నిలిచిన సోను సూద్ 8వ స్థానంలో ఉన్నారు.
Recent Random Post: