ఆచార్య: రామ్ చరణ్ పాత్రకు మార్పులు

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న సినిమా ఆచార్య. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. ఇక్కడే కేరళ విలేజ్ సెట్ ను నగర శివార్లలో వేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్, దాని ముందు వచ్చే ఎమోషనల్ సీక్వెన్స్ లను షూట్ చేస్తున్నారు.

చిరంజీవి కూడా ఆచార్య షూటింగ్ లో పాల్గొంటున్న విషయం తెల్సిందే. చిరంజీవి, సోను సూద్ మరికొంత మంది ముఖ్య తారాగణం మధ్య ఈ షూటింగ్ సాగుతోంది. అయితే ప్రస్తుతం చిరంజీవి, నాగబాబు కూతురు నిహారిక పెళ్లి సందర్భంగా మూడు రోజులు సెలవు మీద రాజస్థాన్ వెళ్లారు.

ఇక తాజా సమాచారం ప్రకారం ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ పాత్రకు మార్పులు చేర్పులు జరిగాయట. ముందుగా ఈ పాత్ర కోసం కొరటాల శివ మహేష్ బాబును అనుకున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవి చొరవతో రామ్ చరణ్ ఫ్రేమ్ లోకి వచ్చాడు. అయితే రామ్ చరణ్ రావడంతో స్క్రిప్ట్ లో మార్పులు చేయక తప్పలేదు కొరటాల శివకు.

ముందు 10-15 నిముషాలు అనుకున్న పాత్ర కాస్తా ఇప్పుడు 35-40 నిమిషాల పాత్రగా మారినట్లు తెలుస్తోంది. ఇందుకోసం మార్పులు చేసి స్క్రిప్ట్ ను మళ్ళీ సిద్ధం చేసాడు ఈ బ్లాక్ బస్టర్ దర్శకుడు.


Recent Random Post: