ఎక్స్ క్లూజివ్: బిగ్‌బాస్‌ లో నేడు.. డాన్సింగ్‌ టాస్క్‌ లో వారి త్యాగాలతో మోనాల్‌ విన్‌

ఈ వారం మొత్తం కూడా ప్రేక్షకులను ఓట్లు అడిగేందుకు అవకాశం కోసం టాస్క్‌ లు చేశారు. ఇప్పటికే మూడు టాస్క్‌ లు అయ్యాయి. నేటి ఎపిసోడ్‌ లో నాల్గవ టాస్క్ ఇచ్చారు. ఇందులో భాగంగా నాన్‌ స్టాప్‌ గా 20 నిమిషాలు ఎవరు అయితే డాన్స్‌ చేస్తారో వారు విన్నర్‌ అంటూ బిగ్‌ బాస్‌ ప్రకటించాడు. పోడియం ఎక్కిన వారు కిందకు దిగకుండా, కూర్చోకుండా, ఆగకుండా కంటిన్యూగా డాన్స్‌ చేస్తూనే ఉండాలి. అలా చేసినట్లయితే విన్నర్‌. అభిజిత్‌ మర్చి పోయి కిందికి దిగడంతో డిస్‌ క్వాలిఫై అయ్యాడు.

అరియానా రెండు సార్లు ఓట్లు అడిగింది కనుక వెంటనే తాను పోటీ నుండి తప్పుకుంటున్నట్లుగా చెప్పింది. ఇక సోహెల్‌ తాను ఓట్లు అడిగాను కనుక ఇతరులకు అవకాశం ఇస్తానంటూ దిగేశాడు. ఇక మిగిలిన హారిక మరియు మోనాల్‌ లు మాట్లాడుకున్నారు. ఇద్దరిలో మోనాల్‌ కోసం హారిక త్యాగం చేసింది. అలా మొత్తం అందరు త్యాగం చేయడం వల్ల మోనాల్‌ డాన్సింగ్‌ టాస్స్‌ లో విజేతగా నిలిచింది. దాంతో మోనాల్‌ వెళ్లి కన్ఫెషన్‌ రూంలో ఓట్లు కోరింది. దాంతో ఈ వారం టాస్క్‌ లు పూర్తి అవ్వనున్నాయి. రేపటి ఎపిసోడ్‌ లో నాగార్జున సందడి చేయబోతున్నాడు.


Recent Random Post: