బర్త్‌డే స్పెషల్‌: వెండి తెర సూపర్‌ స్టార్‌ పొలిటికల్‌ సూపర్‌ స్టార్‌ అయ్యేందుకు సిద్దం

తమిళ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కేవలం అరవ తంబీలకు మాత్రమే కాకుండా.. సౌత్‌ లో అన్ని భాషల ప్రేక్షకులను ఉత్తరాది ప్రేక్షకులను ఆ మాటలకు వస్తే ప్రపంచంలోని పలు దేశాల్లోని ప్రేక్షకులను కూడా ఎంటర్‌ టైన్ చేసిన.. చేస్తున్నారు. దాదాపుగా 45 ఏళ్లుగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్న రజినీకాంత్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఉంటుంది. ఆయన గురించి బుక్‌ రాయాలన్నా.. సినిమా తీయాలన్నా కూడా ఒక్క పార్ట్‌ లో పూర్తి అయ్యేది కాదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ఇక తన జర్నీని రాజకీయాల వైపుపుకు మరల్చుతున్నాడు. ఈ ఏడాదిలో చివరి రోజు అయిన డిసెంబర్‌ 31వ తేదీన పార్టీని ప్రకటించబోతున్నట్లుగా ఇప్పటికే రజినీకాంత్‌ ప్రకటించాడు.

వెండి తెరపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ కు తిరులు లేదని ఎన్నో సార్లు నిరూపించుకున్నాడు. పాతిక ముప్పై సంవత్సరాల పాటు తమిళ సినీ ఇండస్ట్రీలో నెం.1 హీరోగా కొనసాగిన.. కొనసాగుతున్న గ్రేటెస్ట్‌ రజినీకాంత్‌ దాదాపు రెండు దశాబ్దాలుగా రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. ఆయన రావాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. రాజకీయ శూన్యత ఉన్నప్పుడు వస్తే ప్రయోజనం ఏమైనా ఉండే అవకాశం ఉంటుంది. కాని తమిళనాట జయలలిత మరియు కరుణానిధి వంటి హేమా హేమీలు ఉన్న సమయంలో రాజకీయ అరంగేట్రం ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉందని రజినీకాంత్‌ భావించినట్లుగా ఉన్నాడు. అందుకే వారిద్దరు ఎప్పుడైతే చనిపోయారో అప్పుడు తమిళనాట తన అవసరం ఉందనే నిర్ణయానికి రజినీకాంత్‌ వచ్చారు.

రాజకీయ శూన్యత అనేది తమిళ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో కనిపించకున్నా కూడా ఖచ్చితంగా ఈ సమయంలో మాత్రం తన అవసరం ప్రజలకు ఉందని రజినీకాంత్‌ భావిస్తున్నాడు. అందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న అనిశ్చితిని తీర్చేందుకు ఇప్పటికే కమల్‌ హాసన్‌ రంగంలోకి దిగాడు. కాని ఆయన కు జనాలు అంతగా మద్దతు ఇస్తున్నట్లుగా అనిపించడం లేదు. ఇలాంటి సమయంలో రజినీకాంత్‌ కూడా వస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయాలను ఆయన ఆలోచించకుండా రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నట్లుగా ప్రకటించాడు.

ఇక రజినీకాంత్‌ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శివ దర్శకత్వంలో అన్నాత్తే సినిమాలో నటిస్తున్నాడు. సినిమా షూటింగ్‌ మద్యలో ఉంది. కరోనా కారణంగా సినిమాను ఆపేశారు. వచ్చే మార్చి ఎప్రిల్‌ లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న కారణంగా మొత్తానికి వాయిదా వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. పార్టీని ప్రకటించిన తర్వాత రజినీ కాంత్‌ పూర్తిగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అందుకు సంబంధించి చర్చలు జరుగుతూనే ఉన్నాయి. సినిమాల్లో రజినీని చాలా చూశాం. ఇప్పుడు పొలిటికల్‌ స్క్రీన్‌ పూ చూడాలని కోరుకుంటున్నట్లుగా అభిమానులు అంటున్నారు. అందుకే రజినీకాంత్ మార్పు తెస్తారు అంటూ రాజకీయాల్లోకి రాబోతున్నట్లుగా ప్రకటించాడు.

నేడు సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ పుట్టిన రోజు. ఈ సందర్బంగా ఆయనకు అశేష్‌ అభిమానగణం మరియు సన్నిహితుల తరపును ముఖ్యంగా మా టీం తరపున హృదయ పూర్వక పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సినిమాల్లో ఎంతో సాధించిన రజినీకాంత్‌ వచ్చే బర్త్‌ డే వరకు రాజకీయాల్లో ఉన్నత శిఖరాల్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ బర్త్‌ డే సౌత్‌ ఇండియా సూపర్‌ స్టార్‌.


Recent Random Post: