ఇంత పెద్ద బ్రేక్‌ రాలేదు

‘‘అది జరగట్లేదు, ఇది జరగట్లేదు అనుకొని బాధపడటం కంటే మన దగ్గరున్న వాటితో సంతృప్తిపడటం గొప్ప ఫిలాసఫీ. నేనదే చేస్తుంటాను. ఈ ఏడాది అందరికీ కష్టంగానే గడిచింది’’ అన్నారు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌. ఈ ఏడాది ఎలా సాగిందో చెబుతూ– ‘‘లాక్‌డౌన్‌ వల్ల మన గురించి మనం ఆలోచించుకునే అవకాశం దొరికింది. మనల్ని మనం సమీక్షించుకొని మనకున్న వాటిని మరింత అభినందించాలని తెలుసుకున్నాను. షూటింగ్స్‌తో బిజీగా ఉండటం వల్ల మా అమ్మానాన్నతో ఎక్కువ రోజులు కలసి ఉండటం కుదర్లేదు. కెరీర్‌లో ఇంత పెద్ద బ్రేక్‌ ఎప్పుడూ రాలేదు. మేం విహారయాత్రకు వెళ్లి పదేళ్లు పైనే అయింది. ఈ బ్రేక్‌లో మాల్దీవులు వెళ్లాం. ఇది నా బెస్ట్‌ హాలిడే’’ అన్నారు.


Recent Random Post: