సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఓ సినిమా కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి పండగ తర్వాత ప్రారంభం కానుందని సమాచారం. అనిల్ సుంకర నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కనుంది. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ స్టయిలిష్ చిత్రం కోసం ప్రస్తుతం అఖిల్ సిద్ధం అవుతున్నారని తెలిసింది. సంక్రాంతి తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. విదేశాల్లోనూ ఈ సినిమాను చిత్రీకరించనున్నారు. ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారో ఇంకా ప్రకటించలేదు. అఖిల్ తాజా చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ చిత్రీకరణ తుది దశలో ఉంది. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజా హెగ్దే కథానాయిక.
Recent Random Post: