టాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు, జక్కన్నగా పిలుచుకునే ఎస్ఎస్ రాజమౌళి చేస్తున్నా సినిమా ‘ఆర్ఆర్ఆర్‘. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇంకా చాలా వరకే బాలన్స్ ఉంది. అనుకున్న షెడ్యూల్స్ కాన్సల్ అవ్వడం లేదా పోస్ట్ ఫోన్ అవుతుండడంతో సినిమా ఎప్పటికి పూర్తవుతుందో కచ్చితమైన క్లారిటీ లేదు.
దాంతో సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై తీవ్రమైన ట్రోల్స్ వస్తున్నాయి. అందులో కొందరు రాజమౌళి షూట్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ స్పీడప్ చేసారు కావున 2021 దసరా కానుకగా రిలీజ్ అవుతుందని అంటుంటే, మరి కొందరు 2022 సంక్రాంతికి ఫిక్స్ అని అంటున్నారు. మరోవైపు ఇవన్నీ కాదు 2022 జులై లోనే ఆర్ఆర్ఆర్ వస్తుందని చెబుతుండడంతో అభిమానులు గందరగోళంతో రాజమౌళి పై ట్రోల్స్ చేస్తున్నారు.
మరోవైపు ఎన్.టి.ఆర్ ఫాన్స్ అయితే ఆర్ఆర్ఆర్ కంటే ఎన్.టి.ఆర్ త్రివిక్రమ్ తో చేయనున్న సినిమా రిలీజైపోతుంది.. కానీ ఆర్ఆర్ఆర్ మాత్రం ఇప్పుడప్పుడే రిలీజయ్యేలా కనిపించడం లేదు.. ఏంటో ఈ ఆలస్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై చిత్ర టీం ఏమన్నా రెస్పాండ్ అవుతుందేమో చూడాలి.
Recent Random Post: