‘దిల్ రాజు కాదు.. కిల్ రాజు..’ మరో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను ఆవేదన..!

‘టాలీవుడ్, సినిమా ధియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉండిపోతున్నాయి..’ అంటూ కొందరు వాదిస్తూ ఉంటారు. ఆ నలుగురిలో దిల్ రాజు పేరు కూడా వినిపిస్తూ ఉంటుంది. అయితే.. దానిని నిజం చేస్తూ దిల్ రాజుపై తెలంగాణలో మరో పంపిణీదారుడు కార్తికేయ డిస్ట్రిబ్యూటర్స్ వరంగల్ శ్రీను ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ పెట్టడం సంచలనం రేపుతోంది. ‘ఆయన దిల్ రాజు కాదు.. కిల్ రాజు. తెలుగు సినిమాలను కిల్ చేసేస్తున్నాడు’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రవితేజ సినిమా క్రాక్ ను వరంగల్ శ్రీను తీసుకున్నారు. దిల్ రాజు రెడ్, అల్లుడు అదుర్స్, మాస్టర్ సినిమాలు తీసుకున్నారు.

ఆయన సినిమాల కోసం క్రాక్ ధియేటర్లను తగ్గించేస్తున్నారని వరంగల్ శ్రీను మండిపడ్డారు. దిల్ రాజు కిల్ రాజుగా మారిపోయాడని తీవ్రంగా మండిపడ్డారు. మంచి ధియేటర్లలో ఆయన సినిమాలు నడిపిస్తూ ఉపయోగం లేని ధియేటర్లను క్రాక్ కోసం కేటాయించడంపై ఆయన మండిపడుతున్నారు. దిల్ రాజు, శిరీష్ తనకు ఎక్కువ ధియేటర్లు కేటాయస్తానని మాట ఇచ్చి ఇప్పుడు తప్పించుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. రెండేళ్ల క్రితం దిల్ రాజు.. తెలుగు సినిమాలకు కాకుండా తమిళ సినిమాలకు ధియేటర్లు ఎలా కేటాయిస్తాం అంటూ ప్రశ్నించారని.. ఇప్పుడు మాస్టర్ కు ఎలా ధియేటర్లు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు.

క్రాక్ ఇప్పటికే మంచి టాక్ తో హౌస్ ఫుల్స్ తో రన్ అవుతుంటే.. తన సినిమాల కోసం మాకు ధియేటర్లు తగ్గించేస్తున్నారు. ధియేటర్లు గురించి అడుగుతుంటే.. ఏరా, ఏంట్రా, ఎవడు నువ్వు.. అంటూ మర్యాద లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఇన్నాళ్లు ఓపిక పట్టామని.. అది నశించే ఈరోజు బయటకు రావాల్సి వచ్చామన్నారు. దిల్ రాజు కూడా ఓ డిస్ట్రిబ్యూటర్ మాత్రమే.. అంతకంటే ఎక్కువేం కాదన్నారు. సినిమాల కంటే ఇకపై దిల్ రాజుపైనే తన ఫోకస్ ఉంటుందని అంటున్నారు. దీంతో టాలీవుడ్ లో మరోసారి ధియేటర్ల రగడ మొదలైంది. దిల్ రాజుపై ఇటువంటి విమర్శలు రావడం ఆశ్చర్యమే. మరి.. ఈ అంశంపై ఇండస్ట్రీ ఎలా స్పందిస్తుందో చూడాలి.


Recent Random Post: