మాస్టర్ డే 1 తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ వివరాలు

ఇళయదలపతి విజయ్ నటించిన లేటెస్ట్ సినిమా మాస్టర్ భారీ ఎత్తున హ్యుజ్ అంచనాల మధ్య విడుదలైన సంగతి తెల్సిందే. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే భారీ రేంజ్ లో విడుదలైన ఈ చిత్రం తొలి రోజు వసూళ్లను మాత్రం అదరగొట్టింది. ఒకవైపు 50 శాతం ఆక్యుపెన్సీ క్యాప్ ఉన్నా కానీ మాస్టర్ వసూళ్ల పరంగా ప్రభంజనాన్ని సృష్టించింది.

ఫస్ట్ డే మాస్టర్ 5.75 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ ను సాధించింది. తద్వారా విజయ్ కెరీర్ లోనే తెలుగులో హయ్యస్ట్ గ్రాసర్ సాధించాడు విజయ్. ఈ సినిమాను దాదాపు 9 కోట్లకు తెలుగులో అమ్మారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ను బట్టి చూసుకుంటే వీకెండ్ లోనే ఈ సినిమా ప్రాఫిట్స్ లోకి రావడం ఖాయంగా కనిపిస్తోంది. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. సేతుపతి, విజయ్ కాంబినేషన్ లో వచ్చే సీన్స్ హైలైట్ గా నిలుస్తున్నాయి.


Recent Random Post: