ఫ్యామిలీ సినిమాల హీరోగా మంచి పేరు దక్కించుకుని ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ లో భాగంగా విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్న జగపతి బాబు తాజాగా మీడియాతో ముచ్చటించాడు. జగపతి బాబు తండ్రి వీబీ రాజేంద్ర ప్రసాద్ దర్శకత్వంలో ఏయన్నార్ నటించిన దసరా బుల్లోడు సినిమా విడుదల అయ్యి 50 ఏళ్లు పూర్తి అయ్యింది. ఈ సందర్బంగా సంక్రాంతి కి మీడియా ముందుకు జగపతి బాబు వచ్చాడు. ఆయన మాట్లాడుతూ దసరా బుల్లోడు సమయంలో తాను 6 ఏళ్ల పిల్లాడిని అంటూ చెప్పుకొచ్చాడు. నాన్న గారు మొదటి సినిమాతోనే దర్శకుడిగా సిల్వర్ జూబ్లీ దక్కించుకున్నారు. దర్శకుడు ఎవరు దొరక్కుంటే ఏయన్నార్ అంకుల్ ఆ రోజుల్లో నాన్న ను డైరెక్ట్ చేయమన్నాడు అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.
ఇక సంక్రాంతి సందర్బంగా అందరికి కాకుండా మంచి మనసున్న వారికి మాత్రమే తాను శుభాకాంక్షలు చెబుతాను అన్నాడు. ఈమద్య కాలంలో వెదవలు ఎక్కువ అయ్యారు. వారికి చెప్పకుండా వెదవలు కనుక ఎలాగైనా బతికేస్తారు. కాని మంచి మనసున్న వాళ్లు పిచ్చ మారాజులు అన్నాడు. కనుక వారు బాగుండాలని వారికి మాత్రమే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. నేను ఏ కేటగిరీలోకి వస్తాను అనేది మీరు చెప్పాలి, నా మటుకు నేను వెధవని మాత్రం కాదని నమ్మకం అన్నాడు.
Recent Random Post: