నాని అప్పుడే సింగరాయ్‌ని ముగించేశాడా?

యంగ్ హీరో నాని ప్రస్తుతం ట్యాక్సీవాల ఫేం రాహుల్‌ సంకీర్త్యన్‌ దర్శకత్వంలో శ్యామ్‌ సింగ రాయ్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. మొన్నటి వరకు సినిమా గురించి రకరకాలుగా పుకార్లు చేశాయి. సినిమా బడ్జెట్‌ ఎక్కువ అవ్వడంతో ఒక నిర్మాణ సంస్థ తప్పుకుందని దాంతో నాని చొరవతో కొత్త నిర్మాత వచ్చి చేరాడు అంటూ వార్తలు వచ్చాయి. కొన్ని రోజుల క్రితం షూటింగ్‌ ను లాంచనంగా ప్రారంభిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇంతలోనే సినిమా షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసిందని అంటున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం పూజా కార్యక్రమాలకు ముందుగానే సినిమా షూటింగ్‌ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. సినిమాను లాంచనంగా ప్రారంభించే ఉద్దేశ్యంతో ఇటీవల షూటింగ్ ను ప్రారంభించారు. అందుకే షూటింగ్‌ ప్రారంభం అయిన కొద్ది కాలంకే షూటింగ్ ముగింపు దశకు వచ్చినట్లుగా ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని రాహుల్ సంకీర్త్యన్‌ల కాంబో మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. సమ్మర్‌ లో ఈ సినిమా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం అంటే సుందరానికి సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు.


Recent Random Post: