యాంకర్‌ తన మంచి మనసును చాటుకున్నాడు

తెలుగు బుల్లి తెరపై సూపర్‌ స్టార్‌ గా పేరు దక్కించుకున్న యాంకర్ ప్రదీప్ బుల్లి తెర నుండి వెండి తెరపై కూడా తెరంగేట్రం చేసేందుకు సిద్దం అవుతున్నాడు. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాతో హీరోగా పరిచయం కాబోతున్న ఈ యాంకర్‌ జీ తెలుగు పాటల కార్యక్రమం సరిగమప షో లో తన మంచి మనసును చాటుకున్నాడు. ఆ షోకు మంచి రేటింగ్ రావడంలో ఖచ్చితంగా ప్రదీప్ భాగస్వామ్యం ఉంది అనడంలో సందేహం లేదు. ఇక తాజాగా ఒక సింగర్‌ పాట పాడిన తర్వాత తన యొక్క ఆర్థిక పరిస్థితిని చెప్పడంతో ప్రదీప్ చలించిపోయాడు.

ఆ సింగర్ చదువుకునేందుకు ఆర్థిక సాయం చేయడంతో పాటు ఖచ్చితంగా అతడికి అండగా నిలుస్తానంటూ హామీ ఇచ్చాడు. చదువుకు కావాల్సిన ప్రతి రూపాయిని ఇస్తానంటూ ప్రదీప్‌ చెప్పడంతో అంతా కూడా నిల్చుని మరీ చప్పట్లు కొట్టి అభినందించారు. ప్రదీప్ తన మంచి తనంను ఇలా ప్రదర్శించడం అందరు అభినందిస్తున్నారు.


Recent Random Post: