భార్యకు లవ్లీగా బర్త్‌ డే విషెష్‌ చెప్పిన సూపర్‌ స్టార్‌

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు కెరీర్ ఆరంభంకు ఇప్పటికి చాలా తేడా వచ్చింది. అప్పట్లో ఆయనకు ఉన్న క్రేజ్‌ విషయంలో ఉన్నత స్థాయికి వెళ్లాడు. అలాగే ఆయన పద్దతులు అలవాట్లు ఇతర విషయాల్లో కూడా చాలా మార్పును అభిమానులు గమనించవచ్చు. గతంలో సినిమా వేడుకల విషయంలో అస్సలు ఆసక్తి చూపించే వాడు కాదు. అలాగే సోషల్‌ మీడియాకు దూరంగా ఉండేవాడు. కాని ఇప్పుడు చాలా యాక్టివ్‌ గా ఉంటాడు. అందుకు ఖచ్చితంగా కారణం నమ్రత అంటారు. మహేష్‌ బాబు అభిమానులు ఎక్కువగా ఈ విషయంలో నమ్రతకు థ్యాంక్స్ చెబుతూ ఉంటారు. మహేష్‌ జీవితంలోకి నమ్రత వచ్చిన తర్వాత ఆయన స్టైల్‌ పూర్తిగా మారిపోయింది అనేది టాక్‌.

అంతగా తన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి నమ్రత పుట్టిన రోజు సందర్బంగా మహేష్‌ బాబు అంతే ప్రత్యేకంగా బర్త్‌ డే విషెష్‌ చెప్పుకొచ్చాడు. భార్య నమ్రత ఉంటే తనకు ప్రతి రోజు ప్రత్యేకంగా ఉంటుందన్న మహేష్‌ బాబు నేడు మాత్రం ఇంకాస్త స్పెషల్‌ అన్నాడు. హ్యాపీ బర్త్‌ డే బాస్ లేడీ అంటూ లవ్‌ ఈమోజీని షేర్‌ చేశాడు. మహేష్‌ చాలా లవ్లీగా ట్వీట్‌ చేయడంపై అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇక లేడీస్ నమ్రత అదృష్టవంతురాలు కొందరు మహేష్‌ అదృష్టవంతుడు ఒకరిని ఒకరు పెళ్లి చేసుకోవడం అంటున్నారు.

Share


Recent Random Post: