కార్తీక దీపం సీరియల్ తో తెలుగు బుల్లి తెర ప్రేక్షకులకు దగ్గర అయిన ముద్దుగుమ్మ ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా బాగా పాపులారిటీ దక్కించుకుంది. ప్రస్తుతం ఈమెకు ఉన్న ఇమేజ్ తో బ్రాండ్ అంబాసిడర్ గా కూడా చేసేందుకు సిద్దం అయ్యింది. పలు కంపెనీలు ఈమెను అప్రోచ్ అవుతున్నాయి. తాజాగా ఈమె ఒక వంటలకు సంబంధించిన ప్రోడెక్ట్ కు సంబంధించి అంబాసిడర్ గా వ్యవహరిస్తుంది. సుమతో కలిసి ఈమె యాడ్ షూటింగ్ లో నటిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సుమ రేంజ్ లో ఈమె పారితోషికంను అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆ యాడ్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని సంస్థలు కూడా ప్రేమిని తమ ఉత్పత్తికి ప్రచారం చేయ్యించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాని ఆమె మాత్రం ప్రస్తుతానికి వరుసగా బ్రాండ్ అంబాసిడర్ గా చేసేందుకు ఇష్టపడటం లేదు. కొన్నింటిని ఎంపిక చేసుకుని చేస్తుంది. సీరియల్ తో మాత్రమే కాకుండా వరుసగా ఇలా అంబాసిడర్ గా కూడా సంపాదిస్తుంది. ఇది ఆమె క్రేజ్ కు నిదర్శణంగా చెబుతున్నారు.
Recent Random Post: