పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘వకీల్ సాబ్‘ షూటింగ్ ని ఫినిష్ చేశారు. అలాగే తన తదుపరి సినిమాలైన క్రిష్ డైరెక్షన్ లో చేస్తున్న పీరియడ్ ఫిల్మ్ మరియు అయ్యప్పనుం కోశియుమ్ సినిమా రీమేక్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. క్రిష్ పీరియాడిక్ సినిమాలో పవన్ సరనస నటించబోయే హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు.
గతంలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. కానీ దానిపై కచ్చితమైన వార్త బయటకి రాలేదు. దానికి కారణం నిధి ఆ పీరియాడిక్ రోల్ కి పర్ఫెక్ట్ గా సరిపోతుందా లేదా అనే అనుమానం ఉండడమే. రీసెంట్ గా నిధి అగర్వాల్ పై కొన్ని సన్నివేశాలను మరియు ఓ సాంగ్ ను షూట్ చేశారు. ఆ విజువల్స్ చూసుకున్నాక క్రిష్ కి పూర్తి నమ్మకం రావడంతో క్రిష్ అండ్ టీం పవన్ కళ్యాణ్ కి జోడీగా నిధి అగర్వాల్ ని ఫైనల్ చేసి లాక్ చేశారు.
పవన్ కళ్యాణ్ నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఓ క్వీన్ పాత్రలో కనిపించనుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన ఏఎం రత్నం ఈ సినిమాతో మళ్ళీ తన ప్రొడక్షన్ ని రీస్టార్ట్ చేస్తున్నారు.
Recent Random Post: