టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుపుకుంటోంది. షూటింగ్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో ఈ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చిత్రీకరణ హైదరాబాద్ లో జరుగుతుంది. ఇప్పటికే హీరోల పోస్టర్ లను విడుదల చేశారు. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా నటిస్తున్న విదేశీ ముద్దుగుమ్ము ఒలీవియా మోరిస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్ర కు ప్రేయసి పాత్ర జెన్నిఫర్ గా ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవలే ఈమె పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయినట్లుగా సమాచారం అందుతోంది. అందుకే ఈమె పోస్టర్ ను విడుదల చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ మరియు ఒలివియా మోరిస్ ల కాంబో ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాలో చరణ్ కు జోడీగా నటించిన ఆలియా భట్ ఫస్ట్ లుక్ కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. త్వరలో ఆమె పోస్టర్ ను విడుదల చేస్తారేమో చూడాలి.
Recent Random Post: