బాలీవుడ్ హిట్ మూవీ పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్న విషయం తెల్సిందే. పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న ఈ రీమేక్ కు వకీల్ సాబ్ అనే టైటిల్ ను ఖరారు చేశారు. రికార్డు స్థాయిలో ఈ సినిమా వసూళ్లు సాధిస్తుందనే నమ్మకంతో అంతా ఉన్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం గా ఉంది. ఇదే సమయంలో లాయర్ గా సత్యదేవ్ నటిస్తున్న ‘తిమ్మరుసు’ సినిమా విడుదలకు సిద్దం అవుతుంది. వకీల్ సాబ్ సినిమాలో పవన్ లాయర్‌గా నటించగా, తిమ్మరుసులో హీరో సత్య లాయర్ గా కనిపించాడు.
ఇండస్ట్రీలో లాయర్ గా హీరోలు నటించిన సినిమాలు కాస్త తక్కువే అని చెప్పాలి. ఈతరం స్టార్ హీరోల్లో కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే లాయర్ వేశం కట్టాడు. ఎన్టీఆర్, చరణ్, మహేష్, బన్నీ, ప్రభాస్ వంటి స్టార్స్ ఇప్పటి వరకు నల్ల కోటు వేసింది లేదు. సీనియర్ హీరోలు దాదాపు అందరు కూడా ఏదో ఒక సందర్బంగా లాయర్ గా నటించారు. కాని యంగ్ స్టార్స్ మాత్రం నటించలేదు. పవన్ ఆ ఘనత దక్కించుకున్నాడు. ఇప్పుడు సత్యదేవ్ కూడా అదే మాదిరిగా వరుసగా సినిమాలు చేస్తూ తిమ్మరుసుగా లాయర్ పాత్రలో కనిపించబోతున్నాడు.
Recent Random Post: