మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రం ఆచార్య కు సంబంధించిన మొదటి టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ముందు నుండి ప్రచారం జరిగినట్లుగానే ఈ టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో మొదలైంది. ఆచార్య టీజర్ లో విజువల్స్ ముందుగా మనల్ని ఆకట్టుకుంటాయి. ఇక ఈ టీజర్ చూస్తుంటే ఇదేదో దేవాలయాలు, వాటిని సంరక్షించే వాళ్ళ చుట్టూ నడిచే కథగా అనిపిస్తోంది.
మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా స్టన్నింగ్ గా ఉంది. ఈ టీజర్ ఎక్కువగా ఫైట్స్ అండ్ బిల్డప్ షాట్స్ మీదే ఆధారపడింది. అంతవరకూ అయితే ఆచార్య మెప్పిస్తుంది. ఈ టీజర్ లో చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటుంది. కొరటాల శివ స్టైల్ లోనే ఉంది ఈ డైలాగ్. అలాగే కొన్ని షాట్స్ అయితే మెస్మేరైజ్ చేస్తాయి. ముఖ్యంగా త్రిశూలం షాట్ అయితే మళ్ళీ చూడాలనిపిస్తుంది. అలాగే లాస్ట్ షాట్ లో చిరంజీవి ఎక్స్ప్రెషన్ కూడా వావ్ అనే లానే ఉంది. మొత్తంగా ఆచార్య టీజర్ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేలానే ఉంది.
Recent Random Post: