ఆగని ఆర్ఆర్ఆర్ లీకులు, జూనియర్ భీమ్ ఫోటో లీక్!

ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్ లు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆటోమేటిగ్గా అంచనాలు తారాస్థాయికి అందుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ ను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఆర్ ఆర్ ఆర్ కు సంబంధించి మొదటినుండి ఇబ్బంది పెడుతోన్న అంశం లీకులు. ఆర్ ఆర్ ఆర్ నుండి ఏదొక విధంగా ఇన్ఫో లీక్ అవుతూనే ఉంది. షూటింగ్ స్పాట్ నుండి ఫోటోలు వస్తున్నాయి. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ ఫోటో ఒకటి బయటకు వచ్చింది.

ఆ పిల్లాడి పేరు ధృవన్. ఆర్ ఆర్ ఆర్ లో నేను కూడా నటిస్తున్నాను అని ప్రకటించాడు ఆ పిల్లాడు. షూటింగ్ స్పాట్ లో ఫోటోను పోస్ట్ చేసాడు. అయితే ఏ పాత్రను పోషిస్తున్నాడో చెప్పలేదు. జూనియర్ భీమ్ గా కనిపించనున్నాడని సోషల్ మీడియాలో న్యూస్ హల్చల్ చేస్తోంది.


Recent Random Post: