నందమూరి బాలకృష్ణ గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్నాడు. ఈ నేపథ్యంలో బాక్స్ ఆఫీస్ వద్ద మార్మోగిపోయే హిట్ కొట్టాలన్న కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. మే 28న ఈ చిత్రం విడుదలవుతుందని అధికారికంగా వెల్లడైంది కూడా.
ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత బాలయ్య చేయబోయే సినిమాపై ఇప్పటినుండే బోలెడన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. అనిల్ రావిపూడి, బి. గోపాల్ అంటూ కొన్ని పేర్లు షికార్లు చేసాయి కానీ తాజా సమాచారం ప్రకారం బాలయ్య నెక్స్ట్ సినిమా గోపీచంద్ మలినేనితో ఉంటుందని తెలుస్తోంది. తన తర్వాతి సినిమా బాలయ్యతోనే అని గోపీచంద్ కన్ఫర్మ్ చేసాడు కూడా.
క్రాక్ చిత్రంతో అదిరిపోయే సక్సెస్ ను అందుకున్నాడు గోపీచంద్. ఇదిలా ఉంటే బాలయ్య – గోపీచంద్ మలినేని చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుంది. మే లో ఈ సినిమాను లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి.
Recent Random Post: