రామ్ గోపాల్ వర్మ ఈ మద్య కాలంలో తెరకెక్కిస్తున్న ప్రతి ఒక్క సినిమా వివాదాస్పదం అవుతుంది. లేదంటే వివాదాస్పద అంశాన్ని తీసుకుని మరీ సినిమా తీస్తున్నాడు. తద్వారా ఆయన సినిమాలు కొన్ని కనీసం సెన్సార్ క్లియరెన్స్ కూడా తెచ్చుకోలేక పోతున్నాయి. కోర్టుకు వెళ్లి లేదంటే కేంద్ర సెన్సార్ బోర్డు ముందుకు వెళ్లి సెన్సార్ క్లియరెన్స్ ను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. తెలంగాణలో జరిగిన దిశ సంఘటన ఆ తర్వాత ఎన్ కౌంటర్ నేపథ్యంలో రామ్ గోపాల్ వర్మ సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమాను థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు వర్మ ప్రయత్నిస్తున్నాడు.
వర్మ ఇటీవలే దిశ ఎన్ కౌంటర్ సినిమా షూటింగ్ ను ముగించి సెన్సార్ కార్యక్రమాల కోసం వెళ్లడం జరిగింది. ఈ టైటిల్ మరియు కంటెంట్ పూర్తిగా సెన్సార్ రూల్స్ కు విరుద్దంగా ఉన్నాయని కనుక సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వలేమని చెప్పేశారు. టైటిల్ ను మార్చడంతో పాటు సినిమాలోని పలు సన్నివేశాలను తొలగిస్తేనే సినిమా సెన్సార్ కు ఓకే చెప్తామని రామ్ గోపాల్ వర్మకు సెన్సార్ బోర్డ్ సూచించింది. తన సినిమాల విషయంలో వెనక్కు తగ్గకుండా వివాదాలను సృష్టించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా సెన్సార్ విషయంలో ఎలా వ్యవహరించబోతున్నాడు అనేది చూడాలి.
Recent Random Post: