బిగ్ బాస్: మలయాళ సూపర్ స్టార్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకవ్వాల్సిందే!

బిగ్ బాస్ అనేది సూపర్బ్ కాన్సెప్ట్. ఏ భాషలో దీన్ని మొదలుపెట్టినా దానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంటుంది. హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్న తేడా లేకుండా బిగ్ బాస్ భారతదేశంలో విశేష ఆదరణ చూరగొంటోంది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 4 పూర్తై సీజన్ 5 కు అప్పుడే సన్నాహకాలు మొదలయ్యాయి.

ఇదిలా ఉంటే మలయాళంలో బిగ్ బాస్ రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. మూడో సీజన్ ఫిబ్రవరి 14 నుండి మొదలుకానుంది. మలయాళ బిగ్ బాస్ కు హోస్ట్ గా మోహన్ లాల్ వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ ను హోస్ట్ చేయడానికి మోహన్ లాల్ పారితోషికం వింటే ఎవరైనా షాకవ్వాల్సిందే.

ఎందుకంటే ముందు సీజన్ కు 12 కోట్ల రూపాయల పారితోషికం తీసుకున్న మోహన్ లాల్ ఈసారి 50 శాతం రెమ్యునరేషన్ ను పెంచి 18 కోట్ల రూపాయలు డిమాండ్ చేసాడట. ఈ షో కు వస్తున్న ఆదరణ దృష్ట్యా ఆరు కోట్లు పెంచడానికి బిగ్ బాస్ యాజమాన్యం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండా డీల్ సెట్ చేసుకుంది.


Recent Random Post: