ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. వచ్చే నెలలో రెండవ షెడ్యూల్ కు సంబంధించిన ప్లానింగ్ లో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక సలార్ లో ఒక మాంచి మాస్ మసాలా ఐటెం సాంగ్ ను పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. ఆ ఐటెం సాంగ్ కోసం గ్లోబల్ బ్యూటీగా పేరు దక్కించుకున్న ప్రియాంక చోప్రాను సంప్రదించారనే సమాచారం అందుతోంది.
సలార్ మూవీ లో హీరోయిన్ గా ఇప్పటికే శృతి హాసన్ ను ఎంపిక చేయడం జరిగింది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా శృతి కి మంచి గుర్తింపు ఉన్న కారణంగా పాన్ ఇండియా క్రేజ్ సినిమాకు ఉపయోగపడుతుందని ప్రశాంత్ నీల్ అంటున్నాడు. ఇక ప్రశాంత్ నీల్ ఈ సినిమా ఐటెం సాంగ్ లో ప్రియాంక చోప్రాను నటింపజేయడం వల్ల అంచనాలు భారీగా పెంచడంతో పాటు ఇతర దేశాల్లో ఉన్న ఇండియన్ సినీ అభిమానుల దృష్టిని కూడా ఆకర్షించే అవకాశం ఉందని భావించాడు. అందుకే సలార్ లో పీసీ ఐటెం సాంగ్ చేయించాలని భావిస్తున్నాడు.
Share
Recent Random Post: