సునీత, రామ్ డిజిటల్ మీడియా వేదికగా సంచలన నిర్ణయం?

సింగర్ సునీత ఇటీవలే రెండో వివాహం చేసుకున్న విషయం తెల్సిందే. మ్యాంగో మ్యూజిక్ లేబుల్ అభినేత రామ్ వీరపనేనిను సునీత వివాహం చేసుకున్నారు. వీరి వివాహం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. కొంత మంది దీనిని సమర్ధిస్తే, మరికొంత మంది దీనిపై విమర్శలు చేసారు. ఏదేమైనా వీరిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు.

ఇక రామ్ సునీత పిల్లల విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడట. సునీత పిల్లలు ఇద్దరికీ తన ఆస్తిలో వాటా ఇవ్వబోతున్నాడట. అలాగే తన వ్యాపారంలో కూడా వాటా ఇస్తాడట రామ్.

ఇది పక్కన పెడితే రామ్, సునీత కలిసి మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ మీడియా వేదికగా పాడుతా తీయగా తరహాలో కొత్త తరహా టాలెంట్ సెర్చ్ కార్యక్రమానికి తెర తీయనున్నారు. త్వరలోనే ఈ కార్యక్రమం రూపు దాల్చనుంది. దీని ద్వారా వచ్చిన టాలెంట్స్ కు సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చేయాలనుకుంటున్నారు.


Recent Random Post: