ఫ్యాన్స్‌ కు ‘రాధేశ్యామ్’ యాంటీ క్లైమాక్స్ టెన్షన్‌

యంగ్ రెబల్ స్టార్‌ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న రాధేశ్యామ్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. ఈ సినిమా లో హీరోయిన్‌ గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కృష్ణం రాజు కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉండగా అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉంటుందని మేకర్స్‌ అంటున్నారు. ఈ సమయంలోనే అభిమానులను కలవర పెట్టే విధంగా ఒక వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

రాధేశ్యామ్‌ సినిమా లో యాంటీ క్లైమాక్స్ ఉంటుందట, అంటే కీలకమైన వ్యక్తి మృతి చెందుతారు. ఇలాంటివి సినిమా ల్లో ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆధరించిన సందర్బాలు చాలా తక్కువ ఉన్నాయి. అందుకే ప్రభాస్ అభిమానులు యాంటీ క్లైమాక్స్ విషయమై టెన్షన్‌ పడుతున్నట్లుగా తెలుస్తోంది. యాంటీ క్లైమాక్స్ ఉంటే ఇతర భాషల్లో కూడా ఫీల్ ఉండదేమో అంటున్నారు. ఈ వార్తలు నిజం అవ్వొద్దు అంటూ అభిమానులు ప్రార్థిస్తున్నారు.


Recent Random Post: