పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదలవుతోంది. ఇక వకీల్ సాబ్ నుండి సెకండ్ సింగిల్ సత్యమేవ జయతే నిన్న విడుదలైంది. ఈ సాంగ్ కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. శంకర్ మహదేవన్, పృథ్వీ చంద్ర ఈ సాంగ్ ను ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి ఈ పాటను రాసారు.
ఇక ఎస్ ఎస్ థమన్ అందించిన ట్యూన్ కూడా పవర్ఫుల్ గా ఉండడంతో కొద్దిసేపట్లోనే ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ ను దాటేసింది. అయితే ఈ సాంగ్ ను విన్నవారందరూ వకీల్ సాబ్ గురించి కాకుండా పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి దగ్గరగా ఉందంటూ కామెంట్స్ చేసారు. దీనిపై వచ్చిన మీమ్ కు రామజోగయ్య శాస్త్రి స్పందించారు.
“సినిమా విడుదలయ్యాక మాట్లాడుకుందాం… సరేనా” అంటూ స్పందించారు. సో సినిమాలో ఏం విశేషం ఉండబోతోందా అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు.
సినిమా చూసాక మాట్లాడుకుందాం..సరేనా? https://t.co/P1VTpgk3gx
— RamajogaiahSastry (@ramjowrites) March 4, 2021
Recent Random Post: