కొన్ని నెలల క్రితం సమంత సినిమాలకు గుడ్ బై చెబుతోంది అని వార్తలు వచ్చినప్పుడు సమంత చాలా సీరియస్ అయింది. కావాలనే తనపై ఇలా ప్రచారం చేస్తున్నారని సమంత ఆరోపించింది. కట్ చేస్తే సమంత ఇప్పుడు మళ్ళీ కొత్త సినిమాలను ఒప్పుకోవట్లేదు. అసలు కథలు వినడానికి కూడా ఇష్టపడట్లేదు. తన దగ్గరకు కథలు ఏవీ తీసుకురావద్దు అని తన మేనేజర్లకు సమంత చెప్పేసింది.
ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం సినిమా కోసం సమాయత్తమవుతోంది సమంత. అంతే కాకుండా నయనతార నటిస్తోన్న ఒక తమిళ సినిమాలో కూడా సమంత కీలక పాత్ర పోషిస్తోంది. చూస్తుంటే ఈ రెండు సినిమాల తర్వాత సమంత మరో సినిమాను ఒప్పుకునేలా లేదు.
2017లో నాగచైతన్యతో సమంత వివాహమైంది. అప్పటినుండి సినిమాలను తగ్గిస్తూ వచ్చిన సామ్ మరో ఏడాది తర్వాత పూర్తిగా బ్రేకులు వేస్తుందని అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
Recent Random Post: