స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా పలు దఫాల్లో షూటింగ్ జరుపుకుంటూ రిలీజ్‌కు రెడీ అవుతోంది. కాగా ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇటీవల సుకుమార్ ఓ ఆసక్తికరమైన అంశాన్ని బయటపెట్టాడు.
పుష్ప లో హీరోయిన్‌గా తెలుగు బ్యూటీనే తీసుకోవాలని బన్నీ పట్టుపట్టాడని సుకుమార్ తెలిపాడు. బన్నీ లాంటి స్టార్ హీరో కూడా తెలుగు అమ్మాయికే ఓటు వేశాడంటే ఇది ఖచ్చితంగా విశేషమనే చెప్పాలి. తెలుగు మాట్లాడే హీరోయిన్ అయితే ఈ సినిమాకు పర్ఫెక్ట్‌గా ఉంటుందని ఆయన భావించాడట. అందుకే తెలుగమ్మాయిని హీరోయిన్‌గా తీసుకోవాలని చూశాడట. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరకపోవడం, దీంతో కన్నడ బ్యూటీ రష్మిక మందనను హీరోయిన్‌గా తీసుకోవడం జరిగిందని సుకుమార్ తెలిపారు.
ఏదేమైనా ఓ తెలుగు హీరోయిన్ కావాలంటూ బన్నీ పట్టుపట్టడం ఇప్పుడు ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా, రాబోయే రోజుల్లో బన్నీ ఖచ్చితంగా ఓ తెలుగమ్మాయితో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నట్లు ఈ వార్తతో తేలిపోయింది. మరి బన్నీతో నటించే అవకాశం దక్కించుకునే ఆ తెలుగు హీరోయిన్ ఎవరనేది మనకు కాలమే తెలియజేస్తుంది.
Recent Random Post: