మంచు విష్ణు నటించిన మోసగాళ్లు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది. ఈ వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోసగాళ్లు ప్రమోషన్ లో భాగంగా విష్ణు వరుసగా ఇంటర్వ్యూలో ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక కూడా జరిగింది. సినిమా పై అంచనాలు పెంచేలా విష్ణు మాట్లాడుతున్నారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ సినిమా బడ్జెట్ గురించి చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కు ఏకంగా 50 కోట్లు పెట్టినట్లుగా చెప్పుకొచ్చాడు. అంత బడ్జెట్ ఏంటీ అంటూ అంతా విమర్శించారట, నాన్న కూడా ఈ విషయమై అసంతృప్తి వ్యక్తం చేశాడని విష్ణు చెప్పుకొచ్చాడు.
విష్ణు మాట్లాడుతూ.. కథ చెప్పిన సమయంలో నాన్న చాలా ఎగ్జైట్ అయ్యారు. కాని బడ్జెట్ చెప్పినప్పుడు నీ మార్కెట్ పరిధిని మించి ఖర్చు చేస్తున్నవాంటూ హెచ్చరించాడు. బడ్జెట్ విషయంలో నాన్న అసంతృప్తి వ్యక్తం చేసిన సమయంలో నేను సైలెంట్ గా ఉన్నాను. సినిమా డిమాండ్ చేసింది కనుక నేను అంత బడ్జెట్ పెట్టినట్లుగా విష్ణు చెప్పుకొచ్చాడు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతుంది. మరి మొండి నమ్మకంతో విష్ణు పెట్టిన పెట్టబడి రికవరీ అయ్యేనా లేదంటే ఒక గొప్ప అనుభవంగా మిగిలేనా అనేది ఈ వారంలో సినిమా విడుదల అయిన తర్వాత కాని క్లారిటీ వచ్చే అవకాశం లేదు.
Recent Random Post: