రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నితిన్, కీర్తి సురేష్ ల రంగ్ దే సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ను నిన్న రాత్రి రాజమండ్రిలో నిర్వహించారు. హీరో హీరోయిన్ నితిన్ మరియు కీర్తి సురేష్‌లతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి మరియు సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ లు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు రాజమండ్రిలో సందడి చేశారు. కీర్తి సురేష్ మాట్లాడుతూ సినిమా తప్పకుండా ఆకట్టుకుంటుందనే అభిప్రాయంను వ్యక్తం చేసింది. ఈ సినిమాలో అందరు అనుకుంటున్నట్లుగా నేను విలన్ ను కాదు.. విలన్ నితిన్ అంటూ సరదాగా వ్యాఖ్యలు చేసింది.
నితిన్ మాట్లాడుతూ.. చివరి సారి నేను రాజమండ్రికి భీష్మ సినిమా చివరి పాట షూటింగ్ కోసం వచ్చాను. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే సెంటిమెంట్ తో మళ్లీ మీ ముందుకు వచ్చాము అంటూ చెప్పుకొచ్చాడు. రాజమండ్రి సెంటిమెంట్ తో భీష్మ తరహాలో వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన రంగ్ దే కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుందా లేదా అనేది ఆసక్తికర అంశం. సినిమా ట్రైలర్ మరియు ప్రమోషనల్ వీడియోలు సినిమాపై అంచనాలు పెంచే విధంగా ఉన్నాయి. నితిన్ మరియు కీర్తి సురేష్ ల కాంబో లో కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని అంటున్నారు.
Recent Random Post: