జాతిరత్నాలు సినిమాతో బంపర్ హిట్ కొట్టాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా ఏకంగా 30 కోట్ల షేర్, 50 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. యూఎస్ లో అయితే 1 మిలియన్ డాలర్స్ మార్క్ ను దాటి కరోనా తర్వాత ఈ మార్క్ అందుకున్న తొలి భారతీయ చిత్రంగా నిలిచింది. జాతిరత్నాలు సూపర్ సక్సెస్ తో నవీన్ పోలిశెట్టికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి.
అయితే నవీన్ ఇప్పుడేం కంగారులో లేడు. అందరినీ వెయిటింగ్ మోడ్ లో పెడుతున్నాడు. కాకపోతే నవీన్ ఇప్పటికే ఒక సినిమాకు కమిట్ అయ్యాడు. మహేష్ పి దర్శకత్వంలో యూవి క్రియేషన్స్ బ్యానర్ పై అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నవీన్ పోలిశెట్టి నటించనున్నాడు. 40ల్లో ఉన్న ఒక మహిళకు, 20ల్లో ఉన్న ఒక యువకుడికి మధ్య ప్రేమ కథ ప్రధానాంశంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే ఆసక్తికర టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.
Recent Random Post: