కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌30??

ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌‘ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తన 30వ సినిమాను చేయాల్సి ఉంది. ఏడాది క్రితమే త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ 30 సినిమా ప్రకటన వచ్చింది. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా దర్శకుడు మారాడట. త్రివిక్రమ్‌ తదుపరి సినిమాను మహేష్‌ బాబుతో చేయబోతుండగా ఎన్టీఆర్‌ 30 సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

కొరటాల శివ ప్రస్తుతం ఆచార్య సినిమాను చేస్తున్నాడు. ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ ముగింపు దశకు వచ్చేసింది. ఆ వెంటనే అల్లు అర్జున్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటన వచ్చింది. కాని అనూహ్యంగా అల్లు అర్జున్‌ తో కాకుండా ఎన్టీఆర్‌ తో కొరటాల శివ సినిమాను మొదలు పెట్టడం ఆశ్చర్యంగా ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అధికారిక ప్రకటన నేడు సాయంత్రం రావాల్సి ఉంది.


Recent Random Post: