హోటల్ యజమానిపై కేసు పెట్టిన హీరోయిన్‌

కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ నిక్కీ గర్లానీ పోలీసులను ఆశ్రయించింది. ఒక వ్యక్తిపై చీటింగ్ కేసును పెట్టిన ఈ అమ్మడు పోలీసులను న్యాయం కావాలంటూ ఆశ్రయించింది. తెలుగులో పలు సినిమాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడిని బెంగళూరుకు చెందిన ఒక వ్యక్తి మోసం చేశాడట. ఆ వ్యక్తి తన వద్ద 50 లక్షల రూపాయలను తీసుకుని మోసం చేశాడంటూ ఆమె ఆరోపించింది. హోటల్‌ పెట్టేందుకు 50 లక్షల రూపాయలను ఇచ్చిన తనకు లాభాల్లో వాటా ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నారు.

బెంగళూరులోని కోరమంగళ అనే ప్రాంతంలో నిఖిల్ అనే వ్యక్తి హోటల్ ఏర్పాటు చేసేందుకు గాను నేను 50 లక్షల రూపాయలు ఇచ్చాను. అందుకు గాను నెలకు రూ. లక్ష ఇస్తానంటూ ఒప్పందం చేసుకున్నాడు. కాని ఇప్పటి వరకు ఆయన లక్ష రూపాయలు ఇవ్వలేదు. అలాగే నాకు ఇవ్వాల్సిన మొత్తం కూడా ఇవ్వలేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసు పెట్టింది. నిఖిల్ అనే వ్యక్తిపై చీటింగ్ కేసును పెట్టడంతో పాటు అతడి నుండి తనకు రావాల్సిన మొత్తంను ఇవ్వాలంటూ కోరింది.


Recent Random Post: