కరోనా వికటించే వివేక్ మరణించాడా? ఆరోగ్య కార్యదర్శి వివరణ ఇదీ

కరోనా వైరస్ ఇతర అనర్థాలకు కారణమవుతోంది. టీకా వేసుకుంటే ప్రాణాపాయం అని.. గుండె జబ్బులు ఉన్న వారు వేసుకోకూడదనే ప్రచారం సాగుతోంది. ఇటీవల తమిళ నటుడు వివేక్ వ్యాక్సిన్ తీసుకున్నాక తీవ్రమైన గుండెపోటుతో మరణించడంతో ఈ వ్యాక్సిన్ తీసుకోవాలా? లేదా? అనేది అనేక సందేహాలు భయాలు.. అనుమానాలను ప్రజల్లో కలిగిస్తోంది.కరోనావైరస్ రాకుండా లేదా దాన్నుంచి మన రోగనిరోధక శక్తి పెంపొందడానికి కోవిడ్ టీకాలు వేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. అయితే దాని వల్ల సైడ్ ఎఫెక్ట్ లు కలుగుతున్నాయని కొన్ని సంఘటనలు గందరగోళాన్ని.. అనిశ్చితిని సృష్టిస్తున్నాయి.

తాజాగా ప్రముఖ తమిళ సినీ నటుడు వివేక్ గుండెపోటుకు గురి కావడానికి ఒక రోజు ముందు కరోనా టీకాలు వేసుకున్నాడు. ఆ టీకాలు వికటించే ఆయన మరణించాడని వార్తలు వచ్చాయి. నటుడి మరణానికి టీకా వల్ల కలిగే దుష్ప్రభావమే కారణమని సోషల్ మీడియాలో చాలా మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మరో తమిళ నటుడు మన్సూర్ అలీ ఖాన్ అయితే గుండెజబ్బులు గల వివేక్కు ఎందుకు టీకాలు వేయాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ఆయన గుండెపోటుకు కరోనా వ్యాక్సిన్ కారణమని ఆయన ఆరోపించారు.

ఈ క్రమంలోనే ప్రజలలో భయాందోళనలను తొలగించడానికి తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి రాధాకృష్ణన్ మీడియాకు వివరించారు. “ఇది మాకు షాక్ కు గురిచేస్తోంది. వివేక్ కు కరోనా లేదు. అతను ఇంతకు ముందు కరోనా పరీక్ష చేసుకోగా నెగటివ్ వచ్చింది. అతడికి హృద్రోగ సమస్యలున్నాయి. గుండెనాళాల్లో బ్లాక్స్ కలిగి ఉన్నాడు. ఇప్పుడు దాని కోసం చికిత్స పొందాడు. గుండె నాళాల్లో బ్లాక్ ఒక రోజులో జరగదు. గురువారం 860 మంది వ్యక్తులు అదే ఆసుపత్రిలో వివేక్ వలే కోవాక్సిన్ టీకాలు తీసుకున్నారు. టీకా తరువాత అనాఫిలాక్టిక్ ప్రతిచర్య 15 నుండి 30 నిమిషాల్లో ప్రారంభం అవుతుంది. దీని కోసం మేము ఎల్లప్పుడూ రోగుల కోసం వైద్య సదుపాయం సిద్దంగా ఉంచుతామని”. తెలిపారు. వివేక్ మరణం కరోనా టీకా వికటించడం వల్ల కాదని.. ఆయనకున్న గుండె జబ్బులే నని తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి స్పష్టం చేశారు.

ప్రజలలో అవగాహన కలిగించడానికి నటుడు వివేక్ ఏప్రిల్ 15న మీడియా సమక్షంలో కరోనా వ్యాక్సిన్ షాట్ తీసుకున్నారు. ప్రజలంతా కోవిషీడ్ లేదా కోవాక్సిన్ టీకా తీసుకోవాలని ఆయన సూచించారు. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. వైరస్ నుండి రక్షణ పొందే విషయంలో ఇతర జబ్బులున్నా.. మందులు వాడుతున్నా టీకా వేసుకోవచ్చని ఆయన అన్నారు.

మరుసటి రోజు వివేక్ గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యాడు. అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరి చికిత్స పొందుతూ ఏప్రిల్ 17 ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు


Recent Random Post: