మరో ఇద్దరు సినీ స్టార్స్ కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. రోజుకు లక్షల్లో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలో మరో ఇద్దరు సినీ సెలబ్రిటీలు కరోనా పాజిటివ్ కు గురయ్యారు. తమిళ హీరో అధర్వ, నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడ్డారు. ఈమేరకు వారిద్దరూ తమ ట్విట్టర్ అకౌంట్స్ ద్వారా వెల్లడించారు.

‘శనివారం నాకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మేమంతా ఆరోగ్యంగానే ఉన్నాం. మా అత్తయ్యకు నెగటివ్ వచ్చింది. మేమాంతా ఇంట్లోనే ఉంటూ తగిన జాగ్రత్తలతో చికిత్స పొందుతున్నాం. మరింత ధైర్యంగా ఉండాల్సిన సమయం ఇది. మీరంతా కూడా జాగ్రత్తగా ఉండండి’ అని సమీరా రెడ్డి ట్వీట్ చేశారు.

‘స్వల్ప లక్షణాలు రావడంతో వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ హోమ్ క్వారంటైన్ లో ఉంటున్నాను. త్వరగా కోలుకుని మిమ్మల్ని కలుస్తాను’ అని అధర్వ ట్వీట్ చేశారు.


Recent Random Post: