తెలుగులో బొమ్మరిల్లు సినిమాతో ఒక్క సారిగా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ జెనీలియా దాదాపు పదేళ్ల క్రితం బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ తో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరం అయ్యింది. ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినా కూడా జెనీలియా అందం ఏమాత్రం తగ్గలేదు అనడంలో సందేహం లేదు. అందంతో పాటు అద్బుతమైన నటన సామర్థ్యం ఉన్న జెనీలియా ఇటీవల రీ ఎంట్రీ కోసం తాపత్రయ పడుతోంది. ఈమెకు మొదట తల్లి పాత్రలు వచ్చాయట. దాంతో వాటిని నో చెప్పింది. తాజాగా ఈమెకు హీరోయిన్ గా అవకాశం వచ్చిందట.
రామ్ హీరోగా రూపొందబోతున్న ఒక సినిమాలో జెనీలియాకు హీరోయిన్ గా చాన్స్ వచ్చింది. వీరిద్దరు కాంబోలో రెడీ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వీరి కాంబోలో సినిమా రాబోతుంది. రామ్ ఈ సినిమాలో జెనీలియాను హీరోయిన్ గా ఒప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు. పెళ్లి అయ్యి ఇద్దరు పిల్లలకు తల్లిగా కూడా మారిన జెనీలియాతో ఇప్పుడు రొమాన్స్ కు సిద్దం అయ్యాడు అంటే నిజంగా రామ్ ను అభినందించాల్సిందే అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
Recent Random Post: