ఇంకా హోమ్ క్వారంటైన్ లోనే కొనసాగుతున్న పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కొన్ని రోజుల క్రితం కరోనా సోకిన విషయం తెల్సిందే. తన శంకరపల్లి ఫామ్ హౌజ్ లోనే పవన్ కళ్యాణ్ కరోనాకు ట్రీట్మెంట్ తీసుకున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ కరోనా నుండి కోలుకున్నట్లు, కరోనా నెగటివ్ వచ్చినట్లు, త్వరలోనే సినిమా షూటింగ్స్ కు హాజరవుతారు అంటూ వార్తలు వచ్చాయి.

కానీ వీటిలో సగమే నిజాలు ఉన్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు కరోనా లక్షణాలు పూర్తిగా తగ్గిపోయాయి. కానీ ఇంకా లంగ్ ఇన్ఫెక్షన్ గురించి ఎలాంటి క్లారిటీ రాలేదు. సిటీ స్కాన్ తీయించారు కానీ ఆ రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది.

స్కాన్ రిపోర్ట్స్ వచ్చాక పవన్ కళ్యాణ్ లంగ్స్ ఎలా పనిచేస్తున్నాయి అన్న దాన్నిబట్టి తనకు వైద్యులు తగు సూచనలు చేస్తారట. పూర్తిగా కోలుకున్నాకే పవన్ తిరిగి బయటకు రానున్నాడు. ఇప్పటివరకూ శంకరపల్లి ఫామ్ హౌస్ లోనే మకాం.


Recent Random Post: