ఎన్టీఆర్, కొరటాల శివ… బ్యాక్ గ్రౌండ్ లీకయిందిగా

ఆర్ఆర్ఆర్ సినిమా పూర్తైన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ తో కలిసి సినిమా చేయాలనుకున్నాడు ఎన్టీఆర్. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా పట్టాలెక్కలేదు. త్రివిక్రమ్ తో సినిమా స్థానంలో కొరటాల శివతో సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్.

ఈ సినిమాకు ఆసక్తికర బ్యాక్ డ్రాప్ ను సెట్ చేసినట్లు తెలుస్తోంది. భరత్ అనే నేను చిత్రంలో రాజకీయం అంటే ఏంటో తెలియని ముఖ్యమంత్రి కొడుకు రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందా అని చూపించాడు కొరటాల శివ. ఇప్పుడు ఎన్టీఆర్ తో తెరకెక్కించబోయే చిత్రంలో విద్యార్థి నాయకుడు రాజకీయాల్లోకి వస్తే పరిస్థితులు ఏంటా అన్నది చూపిస్తాడట.

జులైలో ఈ చిత్ర షూటింగ్ ను మొదలుపెట్టి ఏప్రిల్ 29, 2022న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ ఈ ప్యాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


Recent Random Post: