అక్కినేని నాగచైతన్య త్వరలో బాలీవుడ్ సినిమా లాల్ సింగ్ చద్దా సినిమాలో కనిపించబోతున్నాడు. అందుకు సంబంధించిన చర్చలు దాదాపుగా పూర్తి అయ్యాయి. అమీర్ ఖాన్ తో ఆర్మీ సన్నివేశాల్లో నాగ చైతన్య కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం నాగ చైతన్య స్క్రీన్ ప్రజెన్స్ తక్కువ సమయం అయినా కూడా చైతూ ది సినిమా లో చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అంటూ బాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
అమీర్ ఖాన్ మరియు నాగచైతన్యల మద్య వచ్చే సన్నివేశాలు ప్రస్తుతం చిత్రీకరణ కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అమీర్ ఖాన్ పాత్ర ఈ సినిమా లో అత్యంత విభిన్నంగా ఉంటుందని చెబుతున్నారు. హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్ కు ఇది రీమేక్ అనే విషయం తెల్సిందే. నాగచైతన్య తెలుగు లో నటించిన లవ్ స్టోరీ విడుదలకు సిద్దంగా ఉంది. ఇక మరో వైపు థ్యాంక్యూ సినిమా షూటింగ్ కూడా జరుగుతోంది. ఈ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్ లో కూడా నాగ చైతన్య నటించేందుకు ఓకే చెప్పాడనే వార్తలు వస్తున్నాయి.
Recent Random Post: