టాలీవుడ్ లో హీరోల మద్య పోటీ చాలా కామన్ అనే విషయం తెల్సిందే. ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో హీరోల మద్య పోటీ ఉంది. ఈమద్య కాలంలో సినిమాలు లేకపోవడంతో ఏడాది కాలంగా అభిమానులు మరియు హీరోలు సోషల్ మీడియాల రికార్డుల విషయమై చర్చలు జరుగుతున్నాయి. స్టార్ హీరోల ఇన్ స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది. పెద్ద ఎత్తున ఫాలోవర్స్ ను దక్కించుకున్న హీరోల విషయంలో పోటీ నెలకొంది.
టాలీవుడ్ నుండి ఇన్ స్టా లో అత్యధికంగా ఫాలోవర్స్ ను దక్కించుకున్న హీరోల జాబితాలో నువ్వా నేనా అన్నట్లుగా అల్లు అర్జున్ మరియు విజయ్ దేవరకొండలు ఉన్నారు. విజయ్ దేవరకొండ 10 మిలియన్ ల వ్యూస్ ను దక్కించుకున్న మొదటి హీరోగా నిలిచాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ 11.2 మిలియన్ ల ఫాలోవర్స్ తో టాప్‌లో నిలిచాడు. ఇక అల్లు అర్జున్ 11.1 మిలియన్ లతో తర్వాత స్థానంలో ఉన్నాడు. బన్నీ అతి త్వరలోనే రౌడీని క్రాస్ చేస్తాడని అంటున్నారు. వీరిద్దరు ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. దాంతో వీరి ఫాలోవర్స్ సంఖ్య విషయంలో రికార్డు దోబూచులాడుతోంది.
Recent Random Post: