నాని స్టార్ హీరో అవ్వడానికి కార్తీకదీపం డాక్టర్ బాబు చేసిందేంటి?

న్యాచురల్ స్టార్ నాని ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ హీరోగా ఎదిగాడు. ఈరోజు సినిమాకు 10 కోట్ల మేర పారితోషికం తీసుకుంటున్నాడు అంటే అది కచ్చితంగా అతని కష్టమే. అయితే నాని మొదటి సినిమా అష్టా చెమ్మాకు ఎంపికవ్వడానికి ముందు కొంత ఆసక్తికర డ్రామా నడిచింది.

కార్తీకదీపం హీరో నిరుపమ్ పరిటాల ఇటీవలే అలీతో సరదాగా షో కు విచ్చేశాడు. ఈ షో లో తాను సినిమాల్లోకి రావాలనుకున్న విషయాన్ని చెప్పుకొచ్చాడు. తనను మొదట అష్టా చెమ్మా సినిమా కోసం ఆడిషన్ కు రమ్మన్నారని తెలిపాడు. అప్పటికే తాను సీరియల్స్ చేస్తున్నానని అన్నాడు.

అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ నిరుపమ్ ను కనీసం ఆడిషన్ కూడా చేయకుండానే అతని స్థానంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తోన్న నానిని హీరోగా తీసుకున్నారట. కట్ చేస్తే నాని ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో చెప్పాల్సిన పనిలేదు.


Recent Random Post: